చంద్రబాబుకు రాష్ట్రం కంటే రియల్ ఎస్టేటే ముఖ్యం
BY Telugu Gateway22 Jan 2020 1:03 PM IST

X
Telugu Gateway22 Jan 2020 1:03 PM IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు రైతులపై ప్రేమేలేదు. టీడీపీ సభ్యులకు రైతులు, సంక్షేమ పథకాలు వద్దు. వారికి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే కావాలి. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్‌పైనే ప్రేమ ఉంది కానీ రాష్ట్రంపై కాదు అంటూ ధ్వజమెత్తారు. ‘గత మూడు రోజులుగా స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అవమానపరుస్తున్నారు.
స్పీకర్ వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నారు. టీడీపీ సభ్యులకు బెదిరించడం ప్రతీ రోజు అలవాటైంది. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ఎంతో భరోసానిచ్చే ‘రైతు భరోసా’పై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం దారుణం. దీని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు అండ్ టీమ్ కు దేనిపై ప్రేమ ఉందో’ అంటూ కన్నబాబు విమర్శలు చేశారు.
Next Story



