జగన్ కు సీబీఐ కోర్టు షాక్
BY Telugu Gateway3 Jan 2020 5:24 PM IST

X
Telugu Gateway3 Jan 2020 5:24 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. పదే పదే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరటంపై అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో జనవరి 10న కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తోపాటు విజయసాయిరెడ్డి కూడా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. నాంపల్లిలోని సీబీఐ కోర్టు శుక్రవారం నాడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు హాజరు నుంచి మినహాయింపు కావాలని కోరగా..కోర్టుకు అందుకు నో చెప్పింది. అయితే పలు అధికారిక కార్యక్రమాల కారణంగా ఆయన హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే వచ్చే శుక్రవారం అంటే కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు.
Next Story