ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా శైలజానాథ్
BY Telugu Gateway16 Jan 2020 4:52 PM IST

X
Telugu Gateway16 Jan 2020 4:52 PM IST
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నెలకొన్న స్తబ్దతను తొలగించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్థానంలో కొత్తగా సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ను నియమించారు. రఘవీరారెడ్డి ఇఫ్పటికే తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలుపుతూ రాజీనామా లేఖను కూడా పంపారు. ఇంత కాలం మౌనంగా ఉన్న అధిష్టానం తాజాగా కొత్త నియామకాలు చేపట్టింది. శైలజానాథ్ ను పీసీసీ ప్రెసిడెంట్ గా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మస్తాన్ వలీ, తులసిరెడ్డిలను నియమించారు.
Next Story