Telugu Gateway
Cinema

అల్లరి నరేష్ కొత్త మూవీ

అల్లరి నరేష్ కొత్త మూవీ
X

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ జోరు తగ్గింది. తన కామెడీ సినిమాల జోరు తగ్గటంతో రూట్ మార్చాడు. గత ఏడాది మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’లో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్ అందులో మెప్పించాడు. ఇప్పుడు తాజాగా ప్రముఖ దర్శకుడు సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా సోమవారం నాడు ప్రారంభం కానుంది.

రామానాయుడు స్టూడియోలో ఈ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. ఈ సినిమాకు సంబంధించి లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొఖం నిండా గాయాలతో రక్తం కారుతుండగా.. ఎర్రటి కళ్లతో ఉన్న నరేష్‌ లుక్‌ ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. నరేష్‌కు ఇది 57వ సినిమా.

Next Story
Share it