Telugu Gateway
Cinema

నటి సంజనకు షాకిచ్చిన పోలీసులు

నటి సంజనకు షాకిచ్చిన  పోలీసులు
X

ప్రముఖ నటి సంజన చిక్కుల్లో పడ్డారు. కారులో ప్రయాణిస్తూ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవటంతోపాటు..వీడియోలో మాట్లాడినందుకు ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇలా దిగిన ఫోటోలు..వీడియోను సంజన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. ఇది వైరల్ గా మారింది.. దీనిపై నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఓ వైపు కారు నడుపుతూ ఇలాంటి పనులు ఏంటి అంటూ చాలా మంది విమర్శలు చేశారు. పోలీసులు జారీ చేసిన నోటీసులపై సంజన స్పందించారు. తనకు కొంత వ్యవధి కావాలని ఆమె పోలీసులను కోరారు. తాను షూటింగ్‌ నిమిత్తం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నానని, వచ్చిన తరువాత హాజరవుతానని విజ్ఞప్తి చేశారు. సంజన కారులో దిగిన ఫోటోలు..వీడియో వైరల్ గా మారి పోలీసుల కంట పడటంతో వారు రంగంలోక దిగారు.

https://www.youtube.com/watch?v=OqTuD8UMBMY

Next Story
Share it