తెలంగాణ నూతన సీఎస్ గా సోమేష్ కుమార్
BY Telugu Gateway31 Dec 2019 5:25 PM IST

X
Telugu Gateway31 Dec 2019 5:25 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను పక్కన పెట్టి మరీ సీనియారిటీలో మిశ్రా కంటే వెనక ఉన్న సోమేష్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. సాంకేతికంగా సోమేష్ కుమార్ ఏపీ కేడర్ కు అలాట్ అయ్యారు విభజన సమయంలో.అయితే ఆయన క్యాట్ ఆర్డర్ పొంది తెలంగాణలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు ఉన్న సర్వీస్ ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అయితే సీఎం కెసీఆర్ కు, నూతన సీఎస్ సోమేష్ కుమార్ కు పలు అంశాల్లో సారూప్యత ఉందని..అందుకే ఆయన్ను ఎంపిక చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. నూతన సీఎస్ సోమేష్ కుమార్ 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Next Story



