Telugu Gateway
Telangana

శ్రష్టవాణి కొల్లికి ప్రతిష్టాత్మక స్కాలర్ షిప్

శ్రష్టవాణి  కొల్లికి  ప్రతిష్టాత్మక స్కాలర్ షిప్
X

హైదరాబాద్ కు చెందిన యువతి శ్రష్టవాణి కొల్లి ప్రతిష్టాత్మకమైన ‘ఛేంజ్ ద వరల్డ్ స్కాలర్ షిప్’ దక్కించుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్శిటీ ఆఫ్ ఉలెన్ గాంగ్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను శ్రష్టవాణికి ఈ స్కాలర్ షిప్ దక్కింది. ఆస్ట్రేలియాలోని ఉలెన్ గాంగ్ యూనివర్శిటీలో శ్రేష్టవాణి న్యాయశాస్త్ర ఉన్నత విద్యను పూర్తి చేయనుంది. సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రతినిధి, అంతర్జాతీయ రిక్రూట్ మెంట్ మేనేజర్ అయిన పీటర్ ముర్రే నుంచి శ్రష్ట చేంజ్ ఆఫ్ ద స్కాలర్ షిప్ సర్టిఫికెట్ ను అందుకున్నారు. భారత్ లోని యూనివర్శిటీ కన్సల్టెంట్ సంస్థ స్టడీ పాత్ మేనేజింగ్ డైరక్టర్ షెల్లీ కర్నాటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీటర్ ముర్రే మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించే భారతీయులకు పెద్ద ఎత్తున ఛేంజ్ ద వరల్డ్ స్కాలర్ షిప్ ను విస్తృతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ప్రస్తుతం 7.5 లక్షల మంది విద్యార్ధులు వివిధ దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళుతున్నారని స్టడీ పాత్ మేనేజింగ డైరక్టర్ షెల్లీ కర్నాటీ తెలిపారు. తామ ప్రతి విద్యార్ధి తన ఉన్నత విద్యను పూర్తి చేయటంతోపాటు కెరీర్ లో నిలదొక్కుకునే వరకూ సహకరిస్తామని తెలిపారు. శ్రష్టవాణి కొల్లి తల్లితండ్రులు అరవింద్ కొల్లి, ఆషాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు.కొల్లి అరవింద్ సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్ లో పుట్టిన శ్రష్ట ప్రస్తుతం కర్ణాటకలోని యూనివర్శిటీ ఆప్ రేవాలో లా థర్డ్ సెమిస్టర్ చదువుతోంది. మిగిలిన రెండు సెమిస్టర్స్ ను ఆమె ఆస్ట్రేలియాలోని ఉలెన్ గాంగ్ యూనివర్శిటీలో పూర్తి చేయనుంది.

Next Story
Share it