Telugu Gateway
Cinema

శ్వేతా బసు సంచలన నిర్ణయం..వైవాహిక బంధానికి గుడ్ బై

శ్వేతా బసు సంచలన నిర్ణయం..వైవాహిక బంధానికి గుడ్ బై
X

శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ లో ఆమె ఎంట్రీనే ఓ సంచలనం. చేసిన తొలి సినిమానే సూపర్ హిట్. అదే ‘కొత్త బంగారు లోకం’. ఈ సినిమాతో శ్వేతా బసు ప్రసాద్ కు ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు ఆ శ్వేతా బసు ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్‌ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ రోహిత్‌ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ‘రోహిత్‌ మిట్టల్‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డది కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్‌’ అని శ్వేతా పేర్కొన్నారు. 2018 డిసెంబర్‌ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో అట్టహాసంగా జరిగింది. మక్డీ చిత్రం ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా సినీ పరిశ్రలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Next Story
Share it