‘సూర్యుడివో..చంద్రుడివో’ అంటున్న మహేష్ బాబు

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన రెండవ పాటను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ఈ సోమవారం విడుదల చేసింది రెండవ పాట. సూర్యుడివో చంద్రుడివో.. ఆ ఇద్దరి కలయికవో’ అంటూ సాగే ఈ పాట ను విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ ఉపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌కు జంటగా రష్మికా మందన్నా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=124&v=OsA1kGilBzA&feature=emb_logo