Telugu Gateway
Cinema

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్
X

సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ఆదివారం నాడు అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద లోని ఎల్ బి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే వరస పెట్టి పాటలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.

ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన నటించింది. విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత ఇందులోకీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Next Story
Share it