Telugu Gateway
Cinema

సామజవరగమనా వీడియో సాంగ్ విడుదల

సామజవరగమనా వీడియో సాంగ్ విడుదల
X

ఈ పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నూతన సంవత్సరం సందర్బంగా అల్లు అర్జున్ అభిమానుల కోసం వీడియో సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ డ్యాన్స్...పూజా హెగ్డె లుక్స్ పాటపై మరింత క్రేజ్ ను పెంచేలా ఉన్నాయి. విదేశాల్లో అద్భుతమైన లొకేషన్లలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతో హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాలో పూజా హెగ్డెతోపాటు మరో హీరోయిన్ నివేదా పేతురాజ్, సీనియర్ నటి టబు, సుశాంత్, నవదీప్ లు కీలక పాత్రలు పోషించారు. తమన్ అందించిన మ్యూజిక్ పాటల రేంజ్ ను పెంచింది.

https://www.youtube.com/watch?v=Mw9QBhc8_KQ

Next Story
Share it