Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ‘వంద మిలియన్ల రికార్డు’

అల్లు అర్జున్ ‘వంద మిలియన్ల రికార్డు’
X

అల్లు అర్జున్ దుమ్మురేపాడు. ఏకంగా ఒక పాటకు వంద మిలియన్ల వ్యూస్ సాధించి దక్షిణ భారతదేశంలో ఈ రికార్డు నమోదు చేసిన హీరోగా నిలిచాడు. అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించి తొలుత విడుదలైన ‘సామజవరగమన’ పాట ఈ రికార్డును నమోదు చేసింది. ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్ గొంతు పై కొంత మంది విమర్శలు చేసినా కూడా అవి ఎక్కడా పాట సక్సెస్ ను నిలువరించలేకపోయాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యంతోపాటు..తమన్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వెరైటీ వాయిస్ కలపి ఈ పాటను ఓ రేంజ్ కు తీసుకెళ్ళాయి.

అల్లు అర్జున్, పూజా హెగ్డె, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి మూడు లిరిక‌ల్ సాంగ్స్ విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

https://www.youtube.com/watch?v=Thf60JU8E98&feature=emb_logo

Next Story
Share it