Telugu Gateway
Cinema

‘రూలర్’ కొత్త ట్రైలర్ విడుదల

‘రూలర్’ కొత్త ట్రైలర్ విడుదల
X

బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమా విడుదలకు రెడీ అయింది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ఆదివారం నాడు రూలర్ సినిమాకు సంబంధించి కొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే యూపీ లో తెలుగు వాళ్ల సమస్యలు...అక్కడి రాజకీయ నాయకులు తెలుగు వాళ్లను అవమానాల పాలు చేసే విధంగా వ్యవహరించటం..దీన్ని పోలీసు ఆఫీసర్ గా బాలకృష్ణ ఎదిరించినట్లు స్పష్టం అవుతుంది.

అదే సమయంలో పవర్ ఫుల్ డైలాగ్ లు..ఫైటింగ్ సీన్లతో ఈ ట్రైలర్ ను నింపేశారు. ‘ఏరా..యూపీ వాడికి ఏపీ వాడు యముడిలాగా కన్పిస్తున్నాడా’ అని బాలకృష్ణ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా సోనాల్ చౌహన్, వేదికలు నటించారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాత సీ. కళ్యాణ్.

https://www.youtube.com/watch?v=S3I3vzbT9a4

Next Story
Share it