Telugu Gateway
Cinema

సానియా మీర్జాతో రామ్ చరణ్ స్టెప్పులు

సానియా మీర్జాతో రామ్ చరణ్ స్టెప్పులు
X

రామ్ చరణ్, సానియా మీర్జా, ఫరా ఖాన్ ముగ్గురూ కలసి డ్యాన్స్ వేస్తే మామూలుగా ఉంటుందా?. అందరూ ఈ వేడుకవైపు చూడాల్సిందే. ఫరా ఖాన్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా?. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహ వేడుకలో. ఆమె పెళ్ళి అంగరంగా వైభవం జరిగిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో ఆనమ్‌ వివాహం హైదరాబాద్‌లో అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య జరిగింది. ఆనమ్‌-అసద్‌ల వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు.

ఈ వివాహ రిసెప్షన్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో సానిమా మీర్జాతో కలిసి రామ్‌చరణ్‌ స్టెప్పులేసిన వీడియోను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్‌ కొరియోగ్రఫర్‌ ఫరాఖాన్‌ కాలుకదిపారు. చెర్రీకి ఏ మాత్రం తీసిపోకుండా సానియా డ్యాన్స్‌ చేస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోతో పాటు రిసెప్షన్‌కు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Next Story
Share it