Telugu Gateway
Andhra Pradesh

రాజధానిపై ‘పేర్నినాని’ కొత్త ట్విస్ట్

రాజధానిపై ‘పేర్నినాని’ కొత్త ట్విస్ట్
X

ఓ వైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేస్తే మంత్రి పేర్ని నాని మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సభలో ఉండొచ్చు...జరగొచ్చు అని మాత్రమే చెప్పారని..కమిటీ నివేదికలో అలా ఉండే అవకాశం ఉందని మాత్రం ప్రకటించారన్నారు. ఏదైన విషయం ఉంటే ధైర్యంగా చెప్పగల నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు కమిటీలో ప్రతిఫలిస్తాయని..దానికి అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. పేర్ని నాని బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతిలో అక్రమాలు బయటపడతాయని తెలుగుదేశం పార్టీ భయపడుతోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజధానిపై చర్చ జరగడం ఇష్టం లేకపోతే.. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేయొచ్చు కదా అని అన్నారు. అమరావతిపై చర్చ జరిగితే టీడీపీ నేతలను..దుస్తులు లేకుండా ప్రపంచానికి చూపిస్తామని చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు.

జగ్గయ్యపేట దగ్గరలోని జయంతి గ్రామంలో.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు భూములు కొనలేదా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్‌.. రాజధానిలో 300 ఎకరాలు కొన్నారా లేదా? లని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ చేసింది అనైతికమని అంటుంటే .. చంద్రబాబు వినిపించుకోవడం లేదని, దమ్ముంటే జైల్లో వేయమని అంటున్నారని, పాపం పండే రోజు వస్తే అందరూ జైలుకెళ్తారని పేర్ని నాని అన్నారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలనుకుంటే.. ఐదేళ్లలో అందరికీ ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరులు, ధనవంతులకే ప్లాట్లు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పేద టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, జెండా మోసినవారికి అన్యాయం జరిగితే.. కార్లకు జెండా కట్టుకున్నవారు బాగుపడ్డారని అన్నారు. చంద్రబాబును నమ్మిన రైతులకు అన్యాయం జరిగిందని పేర్ని నాని విమర్శించారు.

Next Story
Share it