జీవన ప్రమాణాల పెంచే అభివృద్ధి జరగాలి
BY Telugu Gateway21 Dec 2019 5:00 PM IST

X
Telugu Gateway21 Dec 2019 5:00 PM IST
ఓ నాలుగు ప్రభుత్వ భవనాల నిర్మాణం, కార్యాలయాల ఏర్పాటు అభివృద్ధి కాదని..ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అభివృద్ధి కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వెనకబడిన ప్రాంతాలను రాజకీయ జవాబుదారీతనంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీఎన్ రావు కమిటీ సిఫారసులపై జనసేన ఒక ప్రకటనలో స్పందించింది.ఈ కమిటీ సిఫారసులతో ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందని..అయితే కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి తమ నిర్ణయం ప్రజలు ముందు ఉంచుతామని తెలిపారు.రాష్ట్రంలో వ్యాపార, ఉపాధి అవకాశాలు పెంపొందించటం ద్వారా ప్రగతికి చర్యలు తీసుకోవటంతోపాటు సంపద సృష్టించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
Next Story



