Telugu Gateway
Politics

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్
X

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) మరోసారి వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అన్న అంచనాలు తలకిందులు అయ్యాయి. తాజా పరపతి సమీక్షలో వడ్దీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని నియంత్రణా సంస్థ నిర్ణయించింది. అయితే అందరూ కూడా ఆర్ధిక మందగమనం నేపథ్యంలో వడ్డీరేట్లలో కోత విధిస్తారనే అంచనాలు వెలువడ్డాయి. రెపో రేటును 5.15 శాతంగానే కొనసాగించాలని ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో​ ఆర్ బిఐ నిర్ణయించింది.

అక్టోబర్‌ మాసంలో జరిగిన పరపతి సమీక్షా సమావేశంలో ఆర్ బిఐ కీలక వడ్డీరేటును 25 బేసిస్‌ పాయింట్లు కుదించి 5.15 శాతానికి తగ్గించింది. మరోవైపు తాజా భేటీలో 4.9 శాతంగా ఉన్న రివర్స్‌ రెపో రేటులోనూ ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. స్వల్ప కాలానికి వేచిచూసే ధోరణిలో వ్యవహరించేందుకే ఆర్ బిఐ ద్రవ్య విధాన కమిటీ మొగ్గుచూపింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

Next Story
Share it