కడప స్టీల్ పై కీలక ఒప్పందం
BY Telugu Gateway18 Dec 2019 8:48 AM GMT
X
Telugu Gateway18 Dec 2019 8:48 AM GMT
కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించిక కీలక ఒప్పందం జరిగింది. ప్లాంట్ ఏర్పాటుకు అత్యంత కీలకమైన ముడి ఖనిజం సరఫరాకు సంబంధించిన ఒప్పందం బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎండీసీ కడప స్టీల్ కు ఇనుప ఖనిజం సరఫరా చేయనుంది. ఈ మేరకు ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదిరింది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్నారు.
Next Story