అదరగొడుతున్న నితిన్..రష్మిక డ్యాన్స్
భీష్మ. ఈ సినిమాలో నితిన్, రష్మిక మందన జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ యూత్ ను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ రోమ్ లో పాటల చిత్రీకరణ పనిలో ఉంది. తాజాగా రష్మిక ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో నితిన్, రష్మికలు ఇద్దరూ డ్యాన్స్ అదరగొట్టారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు అంకితమిస్తూ అతడు నటించిన 'వార్' చిత్రంలోని 'గుంగ్రూ' అనే పాటకు నితిన్, రష్మికలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోను రష్మిక తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
https://www.youtube.com/watch?v=MSfW2yhHSZc