తెలంగాణ పోలీసులకు ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు
BY Telugu Gateway6 Dec 2019 6:12 PM IST

X
Telugu Gateway6 Dec 2019 6:12 PM IST
దిశ రేప్..హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ఆ తర్వాత సంఘటనలు కూడా అంతే సంచలనం సృష్టిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ పోలీసులు దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసి శుక్రవారం ఉదయం అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సుమోటోగా స్పందించింది. ఎన్కౌంటర్పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించడానికి తెలంగాణకు నిజనిర్ధారణ కమిటీని పంపాలని ఇన్వెష్టిగేషన్ డీజీని ఆదేశించింది. నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ కావడంపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
Next Story



