Telugu Gateway
Politics

ఢిల్లీలో కెసీఆర్ కు ఎదురైన చిక్కు ప్రశ్న!

ఢిల్లీలో కెసీఆర్ కు ఎదురైన చిక్కు ప్రశ్న!
X

దిశ ఫ్యామిలీ పరామర్శకు వెళ్లలేదు..పెళ్ళికి ఢిల్లీ వచ్చారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గత కొన్ని రోజులుగా జాతీయ మీడియా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దిశ రేప్, హత్య కేసు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించగా..ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ ఘటనపై మాత్రం చాలా ఆలశ్యంగా స్పందించారు. ఈ తీరును జాతీయ మీడియా తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పుడు ఆయనకు మరోసారి ఇదే తరహా అనుభవం ఎదురైంది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన ఓ పెళ్ళి వివాహ రిసెప్షన్ కోసం అని వార్తలు వచ్చాయి.

మంగళవారం మధ్యాహ్నాం వరకూ సీఎం కెసీఆర్ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కెసీఆర్ ను ఓ జాతీయ ఛానల్ ప్రతినిధి మాట్లాడుతూ ‘మీరు దిశా పరామర్శకు వెళ్ళలేదు..పెళ్ళికి ఢిల్లీ వచ్చారు?. సర్ మీ సమాధానం ఏంటి’ అని ఆ రిపోర్టర్ కెసీఆర్ ను పదే పదే ప్రశ్నించారు. అయినా కెసీఆర్ ఇదేమీ పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. అదే సమయంలో భద్రతా సిబ్బంది ఆ ప్రశ్న అడిగిన జర్నలిస్టును కూడా పక్కకు నెట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం వాట్సప్ లో పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతోంది.

Next Story
Share it