Telugu Gateway
Andhra Pradesh

జగన్ వీడియోలను ప్రదర్శించిన నారా లోకేష్

జగన్ వీడియోలను ప్రదర్శించిన నారా లోకేష్
X

ఆంధ్ర్రపదేశ్ లో ప్రస్తుతం ‘వీడియో వార్’ నడుస్తోంది. ఒకరి తప్పు మాట్లాడింది మరొకరు వీడియోలు ప్రదర్శించి మరీ చూపుతున్నారు. గత కొంత కాలంగా ఎమ్మెల్సీ నారా లోకేష్ ను వైసీపీ టార్గెట్ చేసింది. మంగళవారం నాడు శాసనసభలోనూ పలువురు సభ్యులు ఇదే పని చేశారు. దీనికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు. విలేకరుల సమావేశానికి ముందు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసిన ఉచ్చారణలు..మాటలను వీడియోల ద్వారా ప్రదర్శించారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను పప్పు .. అంటున్నవారు... జగన్ గన్నేరు పప్పు అని తెలుసుకోండి. ఈ వీడియోలు చూసిన తర్వాత పేటీఎం బ్యాచ్ ఏమి చెబుతుంది?. వైసీపీ బ్యాచ్ ఏమి మాట్లాడుతుంది’ అని ప్రశ్నించారు. జగన్ తెలుగు భాషే కాదు లెక్కల్లోనూ అన్నీ తప్పులే అని ఎద్దేవా చేశారు.

‘నేను అసెంబ్లీ లో లేకున్నా అందరూ చంద్రబాబు తర్వాత నా పేరు పెట్టి‌ విమర్శలు చేశారు. ఒకటికి పది సార్లు తిట్టినా స్పీకర్ ఏమీ అనలేదు. తెలుగులో చిన్న చిన్న తప్పు లను మాట్లాడి ఉండవచ్చు. నేను వర్ధంతి ని జయంతి అంటే... ఎపి అభివృద్ధి ఆగిపోయిందా. 42వేల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లిన వ్యక్తి నేడు నీతులు చెబుతున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించా. గ్రామాలలో రోడ్లు, వీధి దీపాలు‌ వేశాం. ఇంత చేస్తే... నన్ను అవమానించేలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు తన కొడుకును గెలిపించుకోలేక పోయాడని అంటున్నారు. నాన్న పేరు చెప్పి బతికేవాడిని కాదు.. తండ్రి ఉన్న చోట నిలబడలా. మంగళగిరి లో 1985 తర్వాత టిడిపి గెలవలేదు చరిత్ర సృష్టిద్దామని ప్రయత్నం చేసి విఫలమయ్యాం.

జగన్ కు శుక్రవారం వస్తే భయం మా తాత ఎన్టీఆర్‌ నేను పెరిగే సమయానికే సిఎం. నా మీద, నా కుటుంబం మీద ఏనాడూ ఆరోపణలు రాలేదు. సాక్షి పెట్టిన సమయంలో రెండు రూపాయల కే పేపర్ అన్నారు. ఇప్పుడు ఏడు రూపాయలు కు ఎందుకు అమ్ముతున్నారు. మీరు చెప్పి న అబద్దాల పత్రిక సాక్షిని రెండు రూపాయల కు ఇచ్చి అప్పుడు నీతులు చెప్పండి. అన్నీ పెంచుకుంటూ పోతానంటే అబ్బో జగన్ అనుకున్నారు. కానీ ఇసుక, ఉల్లి, ఆర్టీసీ, ఇసుక అన్నీ పెచుకుంటూ వెళ్లాడు . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చాలా నీతులు చెప్పాడు. నా పై అన్ని రకాలుగా‌ వైసిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ముందు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం దృష్టి పెట్టండి. మీ నాయకుడే నెల్లూరు లో మాఫియా పెరిగిందని అన్నారు. ముందు వాటి సంగతి చూడండి’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

https://www.facebook.com/TDP.Official/videos/559895134846052/

Next Story
Share it