Telugu Gateway
Andhra Pradesh

జగన్ తవ్వుతున్నది వైసీపీని పూడ్చే గొయ్యి

జగన్ తవ్వుతున్నది వైసీపీని పూడ్చే గొయ్యి
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఏడు నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తవ్వుతోంది అవినీతి కాదు. వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారు. 4,075 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలు.

మరి 4,075 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో? భ్రమల్లో బ్రతుకుతున్న వైకాపా నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలి. ఉపసంఘం నివేదికపై ఓపెన్ ఛాలెంజ్.అమరావతిలో జగన్ గారు ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి మేము సిద్ధం. అదే సమయంలో గత ఏడు నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి జగన్ సిద్ధమా? అని నారా లోకేష్ ప్రశ్నించారు.

Next Story
Share it