Telugu Gateway
Cinema

‘టక్ జగదీష్’గా నాని కొత్త సినిమా

‘టక్ జగదీష్’గా నాని కొత్త సినిమా
X

హీరో నాని ఈ సారి వెరైటీ టైటిల్ తో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. అదే ‘టక్ జగదీష్’. ఈ సినిమాలో నానికి జోడీగా పెళ్ళి చూపులు హీరోయిన్ రీతూ వర్మ నటించనున్నారు. ఆమెతో పాటు ఐశ్వర్యా రాజేష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ‘వి’ సినిమాలో నటిస్తూనే కొత్త సినిమాకు రెడీ అయిపోయారు ఈ హీరో. నాని తాజా సినిమా గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద ఓకే టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

గతంలో నానితో ‘నిన్నుకోరి’ సినిమా చేసిన దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ దర్శకుడు. చిత్ర యూనిట్ ఈ సినిమా వివరాలను ప్రకటించింది. షైన్ స్ర్కీన్స్ పతాకంపై హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టక్ జగదీష్ కు తమన్ మ్యూజిక్ అందించనున్నారు. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కంటే నాని సినిమాల పూర్తి విషయంలో ప్రస్తుతం యమా స్పీడ్ గా ఉన్నారనే చెప్పాలి.

Next Story
Share it