Telugu Gateway
Andhra Pradesh

నా కులం మాట నిలబెట్టుకునే కులం..జగన్

నా కులం మాట నిలబెట్టుకునే కులం..జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు గుంటూరు జిల్లాలో ‘ఆరోగ్య ఆసరా’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య కొంత మంది నా కులం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. నా మతం గురించి మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకునే కులం.’ అని వ్యాఖ్యానించారు. మంచిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు అన్నింటిని ..ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా అబివృద్ధి చేస్తామని జగన్ భరోసా ఇఛ్చారు. వైద్యం ఒక అంశం అని చెబుతూ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేసేందుకే మద్యం నియంత్రణకూ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏపీలో బెల్టు షాప్ లు కనపడకుండా చేశాం.

పర్మిట్ రూమ్ లు లేవు. మద్యాన్ని నియంత్రించే చర్యలు ప్రారంభించాం. ప్రైవేట్ వాళ్ళతో అయితే మద్య నియంత్రణం సాధ్యం కాదని..ప్రభుత్వమే ఇందుకు పూనుకుంది. బార్లను కూడా ఏకంగా 40 శాతం మేర తగ్గించాం. రేట్లు షాక్ కొట్టేలానే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుంది అని నమ్ముతున్నాం. క్యాన్సర్ బాధితుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. జవనరి నుంచి క్యాన్సర్ రోగులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి కి వస్తారు. ఎన్ని కుట్రలు చేసినా..కుతంత్రాలు చేసినా..ప్రజలు. దేవుడినే నమ్ముకున్నా.మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా అని జగన్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ తర్వాత కూడా పనుల్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టే వారిని ఆదుకునేందుకు ఈ ఆసరా పథకం ప్రవేశపెట్టినట్లు జగన్ తెలిపారు.

Next Story
Share it