Telugu Gateway
Andhra Pradesh

మీడియా మళ్ళీ ‘చలో వైజాగ్’ అనాల్సిందేనా?!

మీడియా మళ్ళీ ‘చలో వైజాగ్’ అనాల్సిందేనా?!
X

సరిగ్గా ఐదున్నర సంవత్సరాల క్రితం వరకూ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిన మీడియా సంస్థలు రాష్ట్ర విభజనతో చలో అమరావతి అనాల్సి వచ్చింది. నాలుగున్నర సంవత్సరాల క్రితం అన్ని ప్రధాన పత్రికలు..ఛానళ్ళు అన్నీ అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఏపీ నూతన రాజధాని ప్రాంతం కావటంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో అన్ని పత్రికల స్టేట్ బ్యూరోలు ఏర్పాటు అయ్యాయి. ప్రధాన ఛానళ్లు కూడా విజయవాడలో కూడా స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇది జరిగి నిండా ఐదేళ్లు కాలేదు మళ్లీ ఇప్పుడు మీడియా మరో చోటకు వెళ్లాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రతిపాదన తేవటంతో అంతా మళ్లీ అలజడి మొదలైంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉండబోతుందన్న సంతకేతాలు సీఎం జగన్ ఇచ్చారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే సచివాలయలంతోపాటు మరికొన్ని శాఖాధిపతుల కార్యలయాలు వైజాగ్ కు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీడియా పరంగా చూస్తే రోజువారీ కార్యకలాపాలు..వార్తలు జనరేట్ అయ్యేది మంత్రులు..ఉన్నతాధికారులు ఉండే సచివాలయంలోనే. అంటే ఇప్పుడు మీడియా కూడా చలో వైజాగ్ అనాల్సిన పరిస్థితే కన్పిస్తోంది. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా..ఏటా సమావేశాలు మహా జరిగితే గరిష్టంగా 60 నుంచి 65 రోజులు ఉండొచ్చు. అంటే మిగిలిన రోజుల్లో యాక్టివిటి అంతా వైజగ్ లోనే ఉండబోతుంది అన్న మాట. అంటే ఖచ్చితంగా మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కు మారితే మాత్రం అందరూ మరోసారి జెండా మార్చాల్సిందే.

Next Story
Share it