Telugu Gateway
Cinema

పెళ్లి వార్తలపై స్పందించిన కాజల్

పెళ్లి వార్తలపై స్పందించిన కాజల్
X

టాలీవుడ్ చందమామ తన పెళ్లికి సంబంధించి సాగుతున్న ప్రచారంపై స్పందించింది. తాజాగా కాజల్ పెళ్లి త్వరలోనే జరగనుందని, ఆమె కుటుంబ సభ్యులు ఇఫ్పటికే వరుడిని ఎంపిక చేశారని ప్రచారం మొదలైంది. దీంతో ఆమె ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఏ మాత్రం నమ్మోద్దని కోరారు. పెళ్లి గురించి తానే ఓ క్లారిటీ ఇస్తానన్నారు. ప్రస్తుతం ఇతర భాషల్లోని పలు సినిమాల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. కమల్‌ హాసన్‌తో కలిసి కాజల్ భారతీయుడు2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనూ కథలు వింటున్నానని.. నచ్చితే వెంటనే సైన్‌ చేస్తానని తెలిపారు. అదే సమయంలో కాజల్ ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్లు తెలిపారు. కాజల్ శుక్రవారం నాడు విజయవాడలో ఓ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.

Next Story
Share it