Telugu Gateway
Andhra Pradesh

పోలీసులు కాల్చటం తప్పు అంటారా? జగన్ సంచలన వ్యాఖ్యలు

పోలీసులు కాల్చటం తప్పు అంటారా? జగన్ సంచలన వ్యాఖ్యలు
X

అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ చట్టంపై మాట్లాడుతూ సీఎం ఏకంగా సుప్రీంకోర్టు, ఎన్ హెచ్ ఆర్ సీ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీంకోర్టు, ఎన్ హెచ్ఆర్ సీ విచారణలు అట.’ వీళ్ళు వచ్చి ఏమి చెబుతారు. అత్యాచారం తప్పే..అయినా పోలీసులు కాల్చటం తప్పు అంటారా? అని ప్రశ్నించారు. అలా అంటే ఇక భవిష్యత్ లోనూ ఏ రాష్ట్రంలోనూ పోలీసులు ఎవరూ కూడా ముందుకు రారు. దారుణంగా రేప్ చేసి..చంపేసినా కూడా వారిని శిక్షించాలి అంటే ఏ ప్రభుత్వ పెద్దలు ముందుకు రారు. దీని వల్ల తప్పులు చేసిన చేసిన వాళ్ళు యధేచ్చగా బయటకు వస్తారు. శిక్ష పడదు..ఘటన జరిగిన కుటుంబం రోదిస్తూనే ఉంటుంది.’ అంటూ వ్యాఖ్యానించారు. దిశ ఘటన తర్వాత ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని అన్నారు. మరోసారి తెలంగాణ పోలీసులు, తెలంగాణ సీఎం కెసీఆర్ కు సీఎం జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. దిశ ఘటన తర్వాత పోలీసులు సరిగా స్పందించారని కొనియాడారు.

దేశంలో కఠిన చట్టాలు ఉన్నా అవి అమలు కావటం లేదని అన్నారు. ఏడేళ్ల తర్వాత కూడా నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడలేదన్నారు. చట్టాల్లో మార్పు రావాలి. అడుగులు ముందుకు వేయాలి. సినిమాల్లో అయితే అత్యాచారం చేసిన సమయంలో హీరోనో..పోలీసులో కాల్చితే చప్పట్లు కొడతాం కానీ బయట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తాం. శిక్షల ఖరారుకు సంబంధించిన అంశాలు కొన్ని ఉమ్మడి జబితాలో ఉన్నాయని జగన్ తెలిపారు. ఈ బిల్లులో ఒకటి రాష్ట్రపతి దగ్గరకు వెళుతుంది. దీని వల్ల దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందువల్లే రెండు చట్టాలు తెచ్చాం. నాకు చేతనంత వరకూ నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నా. ఏమి జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు. దిశ బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.

Next Story
Share it