మహేష్ బాబును ఆటపట్టించిన రష్మిక
BY Telugu Gateway16 Dec 2019 6:07 PM IST
X
Telugu Gateway16 Dec 2019 6:07 PM IST
‘హీ ఈజ్ సో క్యూట్.. ఈ హీజ్ సో స్వీట్’ అంటూ మహేష్ బాబును రష్మిక ఆట పట్టించింది. ఐదు సోమవారాలు..ఐదు పాటల్లో భాగంగా ఈ సోమవారం కొత్త పాట విడుదలైంది. ఇప్పటి వరకూ విడుదలైన మూడు పాటల్లో ఇదే హైలెట్ గా ఉందని చెప్పొచ్చు. ఈ పాటలో రష్మిక డ్యాన్స్ తోపాటు హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
దీనికి తోడు పాట కూడా బాగుంది. ఈ పాటను మధు ప్రియ పాడగా..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయశాంతి కీలక పాత్రలో నటించారు.
https://www.youtube.com/watch?v=HrrS_TOW4BM
Next Story