రవితేజ సందడి ప్రారంభం..డిస్కోరాజా టీజర్ విడుదల
BY Telugu Gateway6 Dec 2019 6:25 PM IST

X
Telugu Gateway6 Dec 2019 6:25 PM IST
మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘డిస్కోరాజా’ సినిమా జనవరి 24న విడుదల కానుంది. చిత్ర యూనిట్ శుక్రవారం నాడు టీజర్ ను విడుదల చేసింది. అయితే టీజర్ విడుదల కొద్ది గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకెళుతోంది. ఈ టీజర్ లో రవితేజ చాలా స్టైలిష్ లుక్ లో కన్పిస్తాడు.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా నభా నటేష్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఆధారంగా దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. టీజర్లో రివీల్ అయిన రవితేజ క్యారెక్టర్ చాలా ఆసక్తి రేపుతోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
https://www.youtube.com/watch?time_continue=1&v=PDky1zSO7N8&feature=emb_logo
Next Story