Telugu Gateway
Cinema

‘డిస్కోరాజా’ టీజర్ డిసెంబర్6న

‘డిస్కోరాజా’ టీజర్ డిసెంబర్6న
X

మాస్ మహారాజా రవితేజ ‘డిస్కోరాజా’తో సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న ఈ సినిమా టీజర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డిస్కోరాజా సినిమాలో రవితేజతో కలసి పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ లు సందడి చేయనున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవితేజ ఇటీవలే కొత్తగా ‘క్రాక్’ సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

Next Story
Share it