ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్న జగన్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన విషయాన్ని జగన్ మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బహుళ రాజధానులు లేవని వ్యాఖ్యానించారు. నరేంద్ర గురువారం నాడు గుంటూరులో మీడియా సమావేశంలోమాట్లాడారు. జగన్ తన నిర్ణయాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చారు.పార్టీ ప్లీనరీలో కూడా ఇదే మాట చెప్పారు.
మరి ఇఫ్పుడు నిర్ణయం మార్చుకోవటం వెనక కారణాలు ఏంటి అని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు ఎవరైనా అక్రమంగా భూములు కొంటే చర్యలు తీసుకోవచ్చని..ఈ అంశాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నంచారు. ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణాఫ్రికా దేశానితో పోల్చి ఏపీ ప్రజలను జగన్ అవమానించారని నరేంద్ర విమర్శించారు. జగన్ నిర్ణయాలు తెలంగాణకు వరంలా మారాయన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరగదన్నారు.