Telugu Gateway
Politics

ఆర్టీసీ కార్మికులపై కెసీఆర్ వరాలు

ఆర్టీసీ కార్మికులపై కెసీఆర్ వరాలు
X

ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సు60కి పెంపు

సమ్మె కాలానికీ వేతనం

ప్రతి ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తాం.కెసీఆర్

తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం ప్రకటించారు. సెప్టెంబర్ నెల వేతనాలను డిసెంబర్ 2నే అందజేస్తామని..దీంతో పాటు సమ్మె కాలానికి కూడా ఒకేసారి వేతనం అందజేస్తామిన ప్రకటించారు. ప్రతి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీఎం కెసీఆర్ ఆదివారం నాడు తన నివాసంలో రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి వచ్చిన కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కెసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారు.

ఒక్కరినీ కూడా విధుల్లో నుంచి తీసేయమని వెల్లడించారు. అదే సమయంలో ఏ ఒక్క రూటులో కూడా ప్రైవేట్ బస్ లను అనుమతించమని ప్రకటించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సీఎం దగ్గర జరిగిన సమావేశంలో 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు.

Next Story
Share it