Telugu Gateway
Politics

ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్

ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్
X

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 106 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు రానున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని తొలుత సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు అయినా..తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. బుధవారం నాడు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించటంతోపాటు..మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించింది. అదే సమయంలో విదేశాలకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయటం వల్ల ఆర్ధిక నేరాలకు పాల్పడేవారికి తప్పుడు సంకేతాలు పంపుతుందంటూ ఈడీ ఈ బెయిల్ పిటీషన్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.

Next Story
Share it