అల..వైకుంఠపురములో నుంచి మరో హిట్ సాంగ్
BY Telugu Gateway24 Dec 2019 4:55 PM IST

X
Telugu Gateway24 Dec 2019 4:55 PM IST
అల..వైకుంఠపురములో మ్యూజికల్ హిట్ కొట్టేసింది. బుట్టబొమ్మ ఫుల్ సాంగ్ కూడా దుమ్మురేపింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతుండగా..మంగళవారం నాడు విడుదలైన బుట్టబొమ్మ సాంగ్ కూడా అదే దిశగా పయనించేలా ఉంది. కారణం ఈ పాట కూడా శ్రోతలను ఆకట్టుకునేలా ఉండటమే. బుట్టబొమ్మ పాట క్లాసికల్ సాంగ్. ‘ఇంతకన్నా మంచి పోలికేది తట్టులేదు నాకు కానీ అమ్మో..ఈ లవ్ అనేది బబుల్ గమ్.
అంటుకున్నాది అంటే పోదు నమ్ము’ అంటూ మొదలయ్యే పాట బాగుంది. దీంతో సినిమాలో పాటలు అన్నీ మంచి హిట్స్ గా నిలుస్తున్నాయి. ఈ పాటల దెబ్బకు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్, పూజా హెగ్డె జోడీగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=aRGaUZm1_Zg
Next Story