అశ్వత్థామ టీజర్ వచ్చేసింది
BY Telugu Gateway27 Dec 2019 11:31 AM IST

X
Telugu Gateway27 Dec 2019 11:31 AM IST
నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న సినిమా అశ్వత్థామ. ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ‘ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు. వాడికి మాత్రం తెలిసిన ఒక రహస్యం. సైరన్ కూతల కింద పనిచేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం’ అంటూ వచ్చే వాయిస్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది.
అన్ని యాక్షన్ సీన్స్ లోనే హీరో నాగశౌర్య కన్పిస్తాడు. వైజాగ్ కేంద్రంగా సాగిన వ్యవహారంతో సినిమా తెరకెక్కినట్లు కన్పిస్తోంది టీజర్ చూస్తే. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను ఐరా మీడియా నిర్మిస్తోంది. జనవరి 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.youtube.com/watch?v=O6pxb3lg1Ok
Next Story



