Top
Telugu Gateway

‘దర్బార్’ ట్రైలర్ లో అదరగొట్టిన రజనీకాంత్

‘దర్బార్’ ట్రైలర్ లో అదరగొట్టిన రజనీకాంత్
X

రజనీకాంత్ అదరగొట్టారు. ‘దర్బార్’ ట్రైలర్ లో మరోసారి తన సత్తా చూపించారు. తనదైన స్టైలిష్ లుక్స్ లో ప్రేక్షకులను అలరించారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రజనీ ఎంట్రీ ఉంటుంది ఈ ట్రైలర్ లో. ‘ఆదిత్యా అరుణాచలం పోలీస్ కమిషనర్, ముంబయ్ గా కన్పిస్తారు. ‘అఫీసర్స్ ..పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్. వుయ్ లివ్ టూ ప్రొటెక్ట్. వుయ్ డై టూ సర్వ్’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ లు చెబుతాడు రజనీ. నయనతార, రజనీలతో కూడిన ఓ పాట సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

నయనతార దర్బార్ లో మరింత గ్లామరస్ గా కన్పిస్తోంది. ‘సర్ వాళ్లకు చెప్పండి. పోలీసులకు లెఫ్ట్ లో రావొచ్చు..రైట్ లో రావొచ్చు. కానీ స్ట్రెయిట్ గా రావొద్దని ’ అనే డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=cUNNTO0IJSU

Next Story
Share it