‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ రివ్యూ
ఏ సినిమా తీయటానికి అయినా స్టోరీ ముఖ్యం. స్టోరీ బాగుంటే సినిమా బాగుంటుంది. అసలు స్టోరీనే లేకుండా సినిమా తీయటం సాధ్యం అవుతుందా?. బహుశా రామ్ గోపాల్ వర్మకు మాత్రమే అది సాధ్యం అవుతుందేమో. అలాంటి సినిమానే ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’. సినిమా ప్రారంభం నుంచి ఒకటే వివాదాలు..చివరకు కోర్టు మెట్లెక్కటం, తర్వాత సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవటం ఇలా కావాల్సినన్ని వివాదాలు.ఎలాగోలా అవాంతరాలు అధిగమించి ఈ సినిమా గురువారం నాడు విడుదల అయింది. సినిమా మొత్తం ఏపీ రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. ఆ సినిమాలో పాత్రలు..పాత్రదారులు ఏపీ రాజకీయాల్లోనే కన్పిస్తారు. కానీ ఏదీ స్ట్రైయిట్ గా ఉండదు. అన్నీ డొంక తిరుగుడుగానే ఉంటాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్,,ట్రైలర్లు,,పాటలు చూస్తే ఇక సినిమా చూడాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు మించి కూడా సినిమాలో ఏమీ లేదు. సినిమాలో పాత్రలు ఎప్పుడు ఎందుకు వస్తాయో..ఎందుకు పోతాయో తెలియదు. అలా వస్తుంటాయి. పోతుంటాయి. దేనికి కూడా కనెక్టివిటి ఉండదు.
ఈ సినిమా చూస్తే పూర్తిగా ఓ పార్టీని టార్గెట్ చేసి సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. అధికార పార్టీకి అనుకూలంగా..ప్రతిపక్షానికి ప్రతికూలంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర వాస్తవ రాజకీయాల్లో పాత్రలను పోలి ఉంటాయి. పేర్లు మార్చి పెట్టినా ఏ పాత్ర ఎవరిదో ఊహించటం పెద్ద కష్టం కాబోదు. కాకపోతే ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ పాత్రల ఎంపిక అద్భుతం అని చెప్పకతప్పదు. ముఖ్యంగా ఈ సినిమాలో చినబాబు, పీపీ చాల్ పాత్రల పేరుతో ఒరిజినల్ క్యారెక్టర్ల ప్రతిష్టను దెబ్బతీయటమే టార్గెట్ గా సినిమా తెరకెక్కించినట్లు కన్పించింది. ఓవరాల్ గా చూస్తే ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ ను మరింత దారుణంగా పడేసిన సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మను తనను తానే బాగా తిట్టించుకున్నాడు కూడా.
రేటింగ్.1/5