రాజధాని రైతుల ‘బంద్’ పిలుపు
ఏపీలో ప్రస్తుతం రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అయితే రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాము చంద్రబాబు కోసమే లేక మరెవరి కోసమే భూములు ఇవ్వలేదని..రాజధాని అన్నారనే భూములు అప్పగించామని రైతలు రోడ్లెక్కి నినదిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇదే జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి అనుకూలంగా ప్రకటన చేశారని..ఇప్పుడు మాట మార్చటం వెనన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ కాదనరని..అయితే పరిపాలనా రాజధాని మాత్రం ఒకే చోటే ఉండాలని రైతులు వాదిస్తున్నారు.
ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా బుధవారం నాలు పలు గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. గురువారం నాడు మాత్రం 29 గ్రామాల రైతులు బంద్ కు పిలుపునిచ్చారు. తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో నిరాహార దీక్షలకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలను ఓ కంట కనిపెడుతూ తగు చర్యలు తీసుకుంటోంది. అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని..ఇప్పుడు అమరావతి రాజధానే కాదని అంటే ఇది ప్రధాని మోడీని అవమానించటమే అని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. బంద్ అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.