Telugu Gateway
Cinema

‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ విడుదల

‘బుట్టబొమ్మ’ సాంగ్ టీజర్ విడుదల
X

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న అల..వైకుంఠపురములో సినిమా మ్యూజికల్ హిట్ సాధించింది. ఇప్పటికే విడుదలైన పాటల్లో సామజవరగమన, రాములో..రాములా అలా ఇలా దుమ్మురేపలేదు. ఈ రెండు పాటలు ఏకంగా ఒక్కోటీ వంద మిలియన్లపైనే వ్యూస్ సాధించి తెలుగు పాటల చరిత్రలో సరికొత్త చరిత్రను లిఖించాయి. ఓ మైగాడ్ డాడీ పాట మాత్రం ఓ మోస్తరుగా ఉంది. అయితే సినిమా భవితవ్యం తేలేది మాత్రం జనవరి 12నే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావటంతో సినిమా హిట్ అవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి.

దీనికి తోడు పాటలు సినిమా హైప్ ను పీక్ కు తీసుకెళ్లాయి. ఆధివారం నాడు చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ను విడుదల చేసింది. ఫుల్ సాంగ్ మాత్రం డిసెంబర్ 24న విడుదల చేయనున్నారు. ‘బుట్ట బొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే..జిందగీకే అట్టబొమ్మై జట్టు కట్టుకుంటివే’ అంటూ ఈ పాట సాగుతుంది. బుట్టబొమ్మ పాటకు సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించారు. అర్మన్ మాలిక్ ఈ పాట పాడారు.

https://www.youtube.com/watch?v=8Z3DVP8DHUQ

Next Story
Share it