Telugu Gateway
Cinema

అల..వైకుంఠపురములో.. టీజర్ వాయిదా

అల..వైకుంఠపురములో.. టీజర్ వాయిదా
X

అల..వైకుంఠపురములో సినిమాకు ఇప్పటికే క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. దీనికి కారణం ఇఫ్పటికే విడుదలైన పాటలు. సామజవరగమన..రాములో...రాములా దుమ్మురేపాయి. మూడవ పాట ఓ మైగాడ్ డాడీ మాత్రం ఓ మోస్తరుగా నిలిచింది. దీంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో అభిమానులు అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా టీజర్ ఆదివారం నాడు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

కానీ అకస్మాత్తుగా టీజర్ విడుదలను వాయిదా వేసింది. దీనికి కారణం మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్‌ భాయ్‌ మృతిచెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ కుటుంబ సభ్యుడిలా భావించే వ్యక్తి మరణంతో ఈ సమయంలో టీజర్ విడుదల సరికాదని భావించినట్లు చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే మరోసారి డేట్ ను ప్రకటించనున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

Next Story
Share it