అల్లు అర్జున్ టీజర్ 11న
BY Telugu Gateway9 Dec 2019 11:38 AM IST

X
Telugu Gateway9 Dec 2019 11:38 AM IST
అల..వైకుంఠపురములో సినిమా టీజర్ విడుదల తేదీ ఫిక్స్ అయింది. వాస్తవానికి ఈ టీజర్ ఆదివారమే విడుదల కావాల్సి ఉన్నా మెగా ఫ్యామిలీ అభిమాని ఒకరు చనిపోవటంతో దీన్ని వాయిదా వేశారు. టీజర్ విడుదల తేదీని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించిన పాటలు సూపర్ డూపర్ హిట్ కావటంతో టీజర్ పై కూడా అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలక పాత్రలో నివేదా పేతురాజ్ కూడా కన్పించనుంది. ఇది త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా. తాజా ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానులు టీజర్ కోసం డిసెంబర్ 11 వరకూ వేచిచూడాల్సిందే అని తేలిపోయింది. సంక్రాంతికి అంటే జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
Next Story



