Telugu Gateway
Politics

కెసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కెటీఆరే

కెసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కెటీఆరే
X

‘మంత్రి కెటీఆర్ ముక్కుసూటి మనిషి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా కీలకపాత్ర పోషించారు. సహజంగా కెసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటే కెటీఆరే ఉంటారు. ఇందులో అనుమానం ఏముంటుంది. ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు మంత్రి శ్రీనివాసగౌడ్. ఆయన శుక్రవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కేసీఆర్ వైపు...యువత కేటీఆర్ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కెసీఆర్ కుటుంబం ప్రాణాలను సైతం పణంగా పెట్టిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో శ్రీనివాస్ గౌడ్ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. జనవరి 30న కేసీఆర్ సభ పెడతారని ఎవరు చెప్పారు?. ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు.

మతం పేరుతో సమాజాన్ని, మనుషులను విడదీస్తే టీఆర్‌ఎస్ సహించదు. సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. సీఎంను అన్ని పార్టీల నేతలు కలవొచ్చు. ఏ ఎన్నికలు వచ్చినా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. భార్యనే గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్.. మాపై విమర్శలు చేయడమేంటి? శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో ఒక్కసారి అయినా కర్ప్యూ పెట్టారా ? అని ప్రశ్నించారు. బిజెపికి అభివృద్ధి అంశంపై ఓట్లు అడిగే ధైర్యంలేదని, అందుకే ఆ పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టి లాభపడాలని చూస్తోందని ఆరోపించారు. అయితే తెలంగాణలో బిజెపి ఆటలు సాగవన్నారు.

Next Story
Share it