Telugu Gateway
Cinema

‘రూలర్’ ఫస్ట్ సాంగ్ లో బాలకృష్ణ సందడి

‘రూలర్’ ఫస్ట్ సాంగ్ లో బాలకృష్ణ సందడి
X

బాలకృష్ణ ‘రూలర్’గా సందడి చేయనున్నారు. ఈ సినిమా ఇఫ్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. అందులో భాగంగా ‘అడుగడుగో యాక్షన్ హీరో’ అంటూ సాగే పాట ఇప్పుడు హంగమా చేస్తోంది. ఈ సినిమాకు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై రూలర్ సినిమాను సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు శక్తివంతమైన పాత్రల్లో నటించారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ సాయిచ‌ర‌ణ్ భాస్కరుని ఆల‌పించాడు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందించాడు. సినిమాలో బాలకృష్ణ పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా లిరిక్స్‌ ఉన్నాయి. హీరో పవర్ తెలియజేసేలా రామ‌జోగయ్య లిరిక్స్‌ అందించారు.

https://www.youtube.com/watch?time_continue=184&v=yO-buCmun4U&feature=emb_logo

Next Story
Share it