Telugu Gateway
Cinema

‘90ఎంఎల్’ మూవీ రివ్యూ

‘90ఎంఎల్’ మూవీ రివ్యూ
X

కొంత మందికి మందు ఓ వ్యవసం. కొంత మందికి అలవాటు. కానీ నాకు మాత్రం బతకటానికి ‘మందు’ ఓ అవసరం. ఈ డైలాగ్ చూస్తేనే సినిమా కథ ఏంటో తెలిసిపోవటంలా?. ఈ సినిమా అంతా మందు చుట్టూనే తిరుగుతుంది. ప్రేక్షకులకు కిక్కు ఎక్కిస్తుంది. హీరో కార్తికేయకు ఫస్ట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’ మంచి హిట్ ఇచ్చింది. తర్వాత చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయనే చెప్పొచ్చు. సహజంగా మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ హీరో మందు తాగకపోతే చచ్చిపోతాడు. ఇదే సినిమా కథ. కానీ ఈ సినిమా కథను శేఖర్ రెడ్డి ఎర్రా ఆసక్తికరంగా తెరకెక్కించారు. హీరో కార్తికేయ పుట్టినప్పుడే ఓ సమస్యతో పుడతాడు. దేశంలో ఎవరికీ రాని సమస్య అది. అతనికి ఉన్న రిజార్డర్ వల్ల ప్రతి రోజూ మందు తాగితేనే సహజంగా ఉండగలుగుతాడు. లేదంటే చనిపోతాడని..అతను ఎప్పుడైనా తాగొచ్చని ఆథరైజ్డ్ డ్రింకింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తాడు.

ఈ కారణంగానే ఎంబీఏ చదివినా ఉద్యోగం మాత్రం రాదు. చివరకు ఓ వైన్ షాప్ లో మేనేజర్ గా చేరతాడు. ఓ సారి పెద్ద అపార్ట్ మెంట్ సముదాయం నుంచి పిల్లాడు కింద పడుతూ తీగకు తగిలి వేలాడుతుండగా ఆ బాలుడిని రిస్క్ చేసి మరీ కాపాడతాడు హీరో. ఈ వీడియో కాస్తా వైరల్ అవుతుంది. ఈ కారణంగానే హీరోయిన్ నేహా సోలంకితో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత అది కాస్తా ప్రేమగా మారుంది. హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం ఓ పద్దదైన కుటుంబం..మందు వాసనకు కూడా దూరం. కానీ హీరో ఏమో మందు తాగకపోతే చచ్చిపోతాడు. ఈ సన్నివేశాలను దర్శకుడు పక్కాగా ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించాడు.

హీరోయిన్ నేహా సోలంకి ఈ సినిమాలో ‘సువాసన’ పాత్రలో మంచి నటన కనపర్చించింది. భావోద్వేగాలు పండించే సమయంతోపాటు..లవ్ ట్రాక్ లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హీరో కార్తికేయ ఈ సినిమాలో ఫుల్ ఎనర్జిటిక్ గా కన్పించటంతో డ్యాన్స్ ల్లో ఇరగదీశాడు. ఫస్టాఫ్ సినిమా పూర్తి జోష్ లో సాగుతుంది. సెకండాఫ్ కాస్త సాగినట్లు అన్పించినా ఎక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు ఉండవు. నటనలో కూడా చాలా పరిణితి చూపించాడు. సినిమాకు ఈ హైలెట్ అంటే అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌంగ్ మ్యూజిక్. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన రావు రమేష్, రవికిషన్ లు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా కార్తికేయ 90 ఎంల్ ప్రేక్షకులకు ‘కిక్కు’ ఇస్తుందని చెప్పటంలో సందేహం లేదు.

రేటింగ్. 2.75/5

Next Story
Share it