Telugu Gateway
Cinema

‘తిప్పరామీసం’ మూవీ రివ్యూ

‘తిప్పరామీసం’ మూవీ రివ్యూ
X

శ్రీవిష్ణు. ఇప్పటి వరకూ చేసిన చాలా పాత్రలు ‘సెన్సిబుల్’గా ఉన్నవే. కొద్దికాలం వచ్చిన ఈ హీరో సినిమా ‘బ్రోచెవారెవరురా’ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకులను హాయిగా అన్పించింది. బ్రోచెవారెవరురా తర్వాత శ్రీవిష్ణు చేసిన సినిమానే ‘తిప్పరా మీసం’. సహజంగానే గత సినిమా..శ్రీవిష్ణు నటనపై నమ్మకం తిప్పరామీసం టైటిల్ లో ఉన్న ‘ఇంటెన్సిటి’తో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా అంచనాలను నిలబెట్టుకోవటంలో విఫలమైంది. ప్రేక్షకులు ఎన్నోసార్లు చూసిన ఓ అనాథ...అమ్మ...చివర్లో వెల్లడయ్యే తల్లి..కొడుకుల అసలు కథ వెల్లడి క్లైమాక్స్ అనే అత్యంత రొటీన్ కథతో దర్శకుడు క్రిష్ణ విజయ్ సినిమా చుట్టేశారు. స్కూల్ లో చదువుకునే సమయంలో డ్రగ్స్ కు అలవాటుపడిన శ్రీవిష్ణును సరైన దారిలో పెట్టేందుకు అని తల్లి రోహిణి చిన్నపిల్లల పునరావాస కేంద్రంలో ఉంచుతుంది. అక్కడ ఉండటం ఏ మాత్రం ఇష్టంలేని శ్రీవిష్ణు బయటికి వచ్చాక తల్లిపై పగ పెంచుకుంటాడు. అందుకే ఇంటి గుమ్మం కూడా తొక్కడు. కానీ తనకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తనకు రావాల్సిన మొత్తం బలవంతంగా అయినా తెచ్చుకుంటాడు.

ఓ పబ్ లో పనిచేస్తూ తాగుతూ..డ్రగ్స్ తీసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. మధ్యమధ్యలో బెట్టింగుల్లోనూ పాల్గొంటాడు. ఓ క్రికెట్ బుకీకి 30 లక్షలు బాకీ పడి వాటిని తీర్చేందుకు తల్లిపై కేసు వేస్తాడు. తల్లి ఇచ్చిన ఐదు లక్షల చెక్కును ఫోర్జరీ ద్వారా నలభై లక్షలకు మార్చి బ్యాంకుకు సమర్పిస్తాడు. డబ్బుల్లేక చెక్కు వెనక్కి రావటంతో కేసు వేస్తాడు. చెల్లి కోసం చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ ఏడేళ్ల జైలు శిక్ష అనుభిస్తాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటం, సినిమా కూడా స్లోగా సాగుతుండటంతో ప్రేక్షకులకు ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ లోనూ భారంగా కూర్చోవాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ నిక్కి టంబోలి పాత్రే చాలా చిన్నది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. హీరో శ్రీవిష్ణు దారితప్పిన యువకుడి పాత్రలో బాగానే చేసినా కథలో బలం లేకపోవటంతో వర్కవుట్ కాలేదు. అక్కడక్కడ సినిమాలో డైలాగులు మాత్రం మెరుస్తాయి. ఓవరాల్ గా చూస్తే ‘తిప్పరామీసం’తో శ్రీవిష్ణు ప్రేక్షకులను భారీగా నిరాశపర్చాడనే చెప్పాలి.

రేటింగ్.2/5

Next Story
Share it