దీనికెవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చారు
‘పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్లు దీనికి ఎవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చాడు’ ఇదీ హీరోయిన్ హన్సిక సెక్షన్లు చెబుతున్నప్పుడు ప్రభాస్ శీను చెప్పే డైలాగ్. సందీఫ్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ సినిమా నవంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ఒరేయ్ తెనాలి సౌతిండియా షాపింగ్ మాల్లో కూడా ఇన్ని ఆఫర్లు ఉండువురా’,
‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’,అంటూ వినోద్మాత్మకంగా సాగే డైలాగ్‌లతో పాటు.. చివర్లో ‘సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయోచ్చు.. క్రిమినిల్ కేసులు కావు, క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్’అంటూ సందీప్ కిషన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్లో హైలెట్‌గా నిలిచాయి. కామెడీ ఎంటర్‌ట్రైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, చమ్మక్ చంద్ర, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు.
https://www.youtube.com/watch?time_continue=25&v=sSeZVo8o3ko&feature=emb_logo