Telugu Gateway
Politics

తెలంగాణ ఉద్యమ నాయకులు బతికేఉన్నరా?

తెలంగాణ ఉద్యమ నాయకులు బతికేఉన్నరా?
X

మంత్రి ఉన్నడా..సచ్చిండా?

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పోలీసులే బతకాలా?

కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన మంగళవారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ జెఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఏండీ ప్రకటన చేస్తడా.. మంత్రి ఉన్నడా..సచ్చిండా..ఆకలి అవుతుందనే చెప్పుకునే హక్కు కూడా రాష్ట్రంలో లేదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఆర్టీసీ కార్మికుల ను చూస్తుంటె చాలా బాదేస్తుంది. కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే సమ్మె ను విరమించి,విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఐఏఎస్ లే మంత్రులా.మంత్రులు ఉన్నారా...మంత్రి ప్రకటన చేస్తరా..ఐఏఎస్ అధికారి ప్రకటన చేస్తడా. కార్మికుల ను అణగదొక్కే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ముందే ఉన్నట్లు ఉంది.ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి,పోలీసులే బతకాలా..ప్రజలు బతకొద్దా..ఏ డిపో లో చూసినా పోలీసులే.. ఉధ్యమంలో ఆర్టీసీ ని వాడుకో లేదా..అప్పుడు స్పీచు లు ఇచ్చిన మేథావులు ఏమయ్యారు.

తెలంగాణ ఉధ్యమంలో ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టిన మల్లె పల్లి లక్ష్మయ్య, చక్రపాణి ,దేవీ ప్రసాద్ ,మంత్రి శ్రీనివాస్ గౌడ్,స్వామి గౌడ్ ఏమయ్యారు....ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్,మమత కేసీఆర్ ఇంటి దగ్గరే కనబడుతున్నరు... ఉధ్యమ నాయకులకు సిగ్గు అనిపిస్తలేదా...మీ ఓంట్లో ఉన్నది రక్తమేనా... ఉధ్యమ నాయకులు బతికే ఉన్నారా.భూమ్మీదే ఉన్నరా.ఉధ్యమ నాయకులు ఇప్పుడు చెంచా గిరి చేస్తున్నారు ..ఆర్టీసీ కార్మికుల ఉసురు తగులుతుంది..కార్మికుల ను కనికరించండి కేసీఆర్ మానవత్వం తో చూడండి. లేదంటె చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు...ఈ క్యాబినెట్ లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్టీసీ విషయం లో మా పార్టీ ముఖ్య నేతలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేయాలనే దానిపై లేఖ రాస్తా ప్రభుత్వం ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేస్తే మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం లో విలీనం చేస్తాం.. ఈ ప్రభుత్వం కార్మికుల ను తొలగిస్తే ,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల ఉద్యోగాలు వారికే ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it