Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో చేరిన కారెం శివాజీ

వైసీపీలో చేరిన కారెం శివాజీ
X

తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్. ఆ పార్టీకి చెందిన నేత కారెం శివాజీ శుక్రవారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేతత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కారెం శివాజీని అరకు వైసీపీ ఎంపీ మాధవి తన వెంట తోడ్కోని వచ్చారు. వైసీపీలో చేరిన అనంతరం కారెం శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి తన పదవికి రాజీనామా చేసి బేషరతుగా వైకాపాలో చేరినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని తెలిపారు.

లక్షన్నరకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలివ్వడంతో బడుగు బలహీన వర్గాల వారి ఇళ్లల్లో కాంతులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చుతూ సీఎం ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెట్టడం ఎంతో మంచి నిర్ణయం అన్నారు. ఆంగ్ల మాద్యమం విద్య ద్వారా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి సీఎం ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ లకు మరింత ప్రయోజనం కల్పించేలా భవిష్యత్తులో నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story
Share it