Telugu Gateway
Telangana

టీడీపీకి మరో నేత గుడ్ బై

టీడీపీకి మరో నేత గుడ్ బై
X

తెలంగాణ టీడీపీ నుంచి మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు ఎవరి దారి వారు చూసుకోవటంతో తెలంగాణ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితి. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పార్టీ బలోపేతానికి చర్యల తీసుకుంటానని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించినా..ఆ దిశగా పెద్దగా చర్యలు ప్రారంభించిన దాఖలాలు కన్పించటం లేదు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శనివారం రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో ప్రకటించారు. ఆమె బీజేపీలోచేరనున్నట్లు సమాచారం.

నిజామాబాద్‌లో జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేతగా పేరొందిన అన్నపూర్ణమ్మ 1994, 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో 2018 ఎన్నికల్లో పోటీకి ఆమె దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు మల్లికార్జున్‌ ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్‌ గా ఉన్నారు. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వారు చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it